యూనిట్

హోంగార్డు కుటుంబాలకు ఆర్ధిక సహాయం

విజయవాడ నగరంలో హోంగార్డులుగా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు మరియు విధి నిర్వహణలో వుండి వారి పిల్లల వివాహానికి ఆర్ధిక సహాయన్ని నగర పోలీస్‌ కమీషనర్‌ సి.హెచ్‌. ద్వారకా తిరుమల రావు అందజేసారు. విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన ఎస్‌. వెంకట రమణ, జి. మనోజ్‌, ఎస్‌.కె. యాసోఫ్‌ ఆలీ, పి. వెంకటేశ్వర రావు, బి. రాజు, జి. రామతులసమ్మ మరియు కె. హరి ఫణి ల కుటుంబ సభ్యులకు సెంట్రల్‌ వెల్‌ ఫేర్‌ ఫండ్‌ నుండి ఒక్కో కుటుంబానికి రూ.15 వేల చొప్పున చెక్కులను అందజేసారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న బి. రవికుమార్‌, ఎల్‌. వెంకట స్వామి, ఎమ్‌. కమలాకర్‌ ల పిల్లల వివాహా నిమిత్తం సెంట్రల్‌ వెల్‌ ఫేర్‌ ఫండ్‌ నుండి ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున చెక్కులను పంపిణీ చేసారు. కార్యక్రమంలో అడ్మిన్‌ డిసిపి ఎస్‌. హరికృష్ణ, హోంగార్డు ఆర్‌.ఐ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని