యూనిట్

బాధిత పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం

బాధిత పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం పశ్చిమగోదావరి జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు పోలీసు సిబ్బంది ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు పోలీసు సంక్షేమ నిధి నుండి విడుదలైన మొత్తాన్ని జిల్లా ఎస్‌.పి. నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ చేతుల మీదుగా ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి.అప్పాజి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతిచెందారు. ఆయన సతీమణి శ్రీమతి లక్ష్మిదేవికి రూ. లక్షరూపాయలు, ఏఎస్‌ఐ కె.విజయ్‌రావు అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన సతీమణి శ్రీమతి కే.ఎం.ఎస్‌.ఎస్‌.జోషికి రూ.లక్ష రూపాయలు, హెడ్‌కానిస్టేబుల్‌ జి.విజయ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన సతీమణి శ్రీమతి సంతోషంకు లక్ష రూపాయల చెక్కును ఎస్‌.పి. అందజేశారు. పోలీసు సంక్షేమం కొరకు తమవంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వరరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.వెంకట్‌రావు, ఆర్‌.ఐ. అడప కోట సత్యనారాయణ, సెక్రటరీ ఎస్‌.రమేష్‌, స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ బి.ఏసు, హెచ్‌సి వెంకటేశ్వరరావు, ఉమెన్‌ కానిస్టేబుల్‌ రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని