యూనిట్
Flash News
బాధిత హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
కృష్ణాజిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న షేక్ ఉమర్ ఫరూక్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను సహ హోంగార్డులు రూ.3,39,600లు సేకరించారు. ఈ మొత్తాన్ని చెక్కురూపంలో ఫరూక్ సతీమణి శ్రీమతి రిహానాకు జిల్లా ఎస్.పి.రవీంద్రనాథ్‌బాబు అందజేశారు. కార్యక్రమంలో డిఎస్‌పి సత్యనారాయణ, ఆర్.ఎస్.ఐ. రాజేష్ తదితరులు పాల్గొని, బాధిత కుటుంబానికి భరోసా నిచ్చారు.