యూనిట్
Flash News
పోలీసు కుటుంబాలకు ఆర్థిక చేయూత
అనంతపురం
జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఫకృద్దీన్ ఇటీవల మృతిచెందారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకుగాను
తోటి హోంగార్డుల నుంచి రూ.4.50 లక్షలు
సేకరించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఎస్పీ భుసారపు సత్య ఏసుబాబుచేతులమీదుగా
ఫకృద్దీన్ సతీమణి శ్రీమతి ఆస్మాభీకు అందజేశారు. ఇలా సహచరుకుల సహాయం చేయడం
అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. కారుణ్య నియామకం కింద ఫకృద్దీన్ సతీమణికి హోంగార్డుగా ఉద్యోగమిచ్చి ఆదుకుంటున్నట్లు
ఎస్.పి. తెలిపారు. ఇదే జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవిశంకర్ రోడ్డు
ప్రమాదంలో మతి చెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను సిబ్బంది సేకరించిన రూ.80వేలను రవిశంకర్ సతీమణి శ్రీమతి
నాగరత్నమ్మకు ఎస్.పి. అందజేశారు. ఆర్థిక సాయం అందించిన రాప్తాడు ఎస్.ఐ
ఆంజినేయులు ఆధ్వర్యంలో ఆ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు
ఎస్పీ జి.రామాంజినేయులు, డిఎస్పిలు ఎన్.మురళీధర్,
వీరరాఘ వరెడ్డి, సిఐ విజయభాస్కర్ గౌడు,
ఆర్.ఐ పెద్దయ్య, హోంగార్డ్సు
అసోసియేషన్ ప్రతినిధి నారాయణస్వామి, తదితరులు
పాల్గొన్నారు.