యూనిట్
Flash News
హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక చేయూత
జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు. అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణ టాటా, జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబుల చేతుల మీదుగా రూ. 14,05,800/- ల లక్షల విలువ చేసే చెక్కులు అందజేశారు. హోంగార్డులు హరికుమార్, దావుద్ ఖాన్, బాలగంగాధర్, శ్రీనివాసరాజులు ఇటీవలే అనారోగ్యంతో మతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 9,50,400/- విలువ చేసే చెక్కులను డి.ఐ.జి, ఎస్పీలు అందజేశారు. కారుణ్య నియామకం కింద జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన హోంగార్డు జయసింహకు రూ. 4,55,400/-ల విలువ చేసే చెక్కు అందజేశారు. జిల్లా హోంగార్డుల జీతంలో ఒక రోజు వేతన మొత్తాన్ని ఈ ఐదు కుటుంబాలకు చెక్కుల రూపంలో అందజేశారు. ఈకార్యక్రమాలలో అదనపు ఎస్పీ శ్రీమతి కె.చౌడేశ్వరి, ఎం.వి.ఎస్ స్వామి, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఎన్. మురళీధర్, ఆర్.ఐ.లు, హోంగార్డుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, ఉపాధ్యక్షుడు జబీర్ హుస్సేన్, సంయుక్త కార్యదర్శి ఇందిర, ఇ.సి సభ్యులు మల్లారెడ్డి, పలువురు ఆర్.ఎస్.ఐలు, తదితరులు పాల్గొన్నారు.