యూనిట్
Flash News
'ఫిక్కి స్మార్ట్ పోలీసింగ్ - 2019'' అవార్డు

అనంతపురం
జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబుకు ''ఫిక్కి స్మార్ట్ పోలీసింగ్ - 2019'' అవార్డు
దక్కింది. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో ''టెక్నికల్
డాటా అనాలటిక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్''ను నూతనంగా
రూపొందించి అమలు చేశారు. దీంతోపాటు గతంలో అనంతపురం జిల్లా ఎస్పీగా పని చేసిన
జీవీజీ అశోక్ కుమార్ పంచ సూత్రాల అమలుపై స్పెషల్ జూరీ అవార్డు దక్కింది. ఢిల్లీలో
ఈ అవార్డులను వీరిద్దరు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రజల రక్షణ, భద్రతను దష్టిలో ఉంచుకుని మంచి సేవలందించే
వివిధ రాష్ట్రాలు, పారా మిలిటరీ బలగాల నుండీ ఈ అవార్డుల
కోసం 196 ఎంట్రీలు వెళ్లాయి. ఇందులో మన రాష్ట్రం నుండీ 9 నామినేషన్లు వెళ్లగా.... ఈ ఇద్దరు ఎస్పీలు అమలు చేసిన అంశాలు
ఎంపికయ్యాయి. దీంతో ఫెడరేషన్ ఆఫ్ ''ఇండియన్ ఛాంబర్స్
ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంస్థ'' ఈ
అవార్డులను ప్రదానం చేసింది.