యూనిట్

ఆత్మీయ వీడ్కోలు

విజయవాడ నగరంలోని పోలీస్‌ శాఖలో సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులను నగర పోలీస్‌ కమీషనర్‌ ద్వారకా తిరుమల రావు ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ చెందిన మేనేజర్‌ జి.సుజిత్‌ కుమార్‌, ఎస్సైలు కె.సోమేశ్వర రావు, శ్రీమతి ఎన్‌.ఆర్‌.సులోచన, వి.ఎన్‌.శర్మ, ఆర్‌.ఎస్సై కె.బసవబాబు, ఏ.ఎస్సైలు అబ్దుల్‌ రషీద్‌, పి.సుధాకర రావు, ఎన్‌.సింహాచలం, శ్రీమతి సరస్వతి, ఏ.ఆర్‌. ఎస్సై పి.గంగాధరరావు మరియు హెడ్‌ కానిస్టేబుల్‌ పి.వి.జి.ఎస్‌.మూర్తిలకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో సంయుక్త పోలీస్‌ కమీషనర్‌ నాగేంద్ర కుమార్‌, అడ్మిన్‌ డిసిపి కోటేశ్వర రావు స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడిసిపి నవాబ్‌ జానీ, ఏసిపి జి.రాజీవ్‌ కుమార్‌, పోలీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ యమ్‌.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని