యూనిట్
Flash News
నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు

శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ బంగారు కలిగిన వ్యక్తి అరెస్ట్ విషయంలో జిల్లా ఎస్పీ శ్రీ s.v.మాధవ రెడ్డి ఐపీఎస్ గారు నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు.
పై కేసు పుర్వపరాలు ఎస్పీ గారు తెలియజేస్తూ...
ధర్మవరం ఒకటవ పట్టణ సిఐ టి.సుబ్రహ్మణ్యం ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ ఎస్ఐ.హేమంత్ కుమార్ గారికి రాబడిన ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు, వెంటనే అప్రమత్తమైన వారు వారి యొక్క సిబ్బందితో కలిసి 16-5-23 అర్ధరాత్రి సుమారు 1:30 నిమిషాల సమయం లో ముదిగుబ్బ పట్టణ కేంద్రం నుండి కదిరి కదిరి వైపునకు వెళ్ళు రహదారిపై రైల్వే గేట్ సమీపంలో వాహన తలిఖీలు చేయుచుండగా, సదరు నిందితుడైనటువంటి బుక్కే గోవింద నాయక్ (43 సం) S/o బుక్కె రమణ నాయక్ ( కుమ్మర వాండ్ల పల్లి గ్రామం, కదిరి మండలం, ) కదిరి వైపు నుండి హ్యుందయ్ వెన్యూ కారు Rg:- AP39NQ9798 ను స్వతహాగా నడుపుకుంటూ
వచ్చుచూ రైల్వే గేటు సమీపానికి రాగ ఆ సమయంలో అక్కడ పోలీస్ వారు జరుపుతున్న వాహన తనిఖీలను గమనించి కారు ని కొంత దూరంలో ఆపి వెనక్కి తిప్పుకొని పారిపోవుట ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే అప్రమత్తమైన సీఐ టి.సుబ్రహ్మణ్యం, ఎస్సై హేమంత్ కుమార్ గారు మరియు వారి సిబ్బంది తో కలిసి నిందితుడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం దిగువ తెలుపడిన సోత్తును నిందితుడు నుండి స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది.
సీజ్ చేయబడిన వాటి వివరాలు....
1) 42 కట్టలు (1కట్ట=100నోట్లు) నకిలీ 500/రూల కరెన్సీ నోట్లు వాటి విలువ 2100000/ రూ
2) 500/రూ ఒరిజినల్ కరెన్సీ నోట్లు 4, వాటి విలువ 2000/రూ
3) 50 గ్రాముల ఒరిజినల్ బంగారు బిస్కెట్
4)102 గ్రాముల నకిలీ బంగారు బిస్కెట్
5)185 గ్రాముల నకిలీ బంగారు చైన్
6) హ్యుండై వేన్యు కార్ నెంబరు AP39-NQ-9798
అనంతరం నిందితుడిని అరెస్టుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించడం జరిగింది.
కాగా గతంలో నిందితుడుపై వివిధ స్టేషన్లో నాలుగు కేసులను నమోదు అయినట్లుగా తేలింది. వాటిలో కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు,తనకల్లు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒక కేసులో నిందితుడు ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలందరూ ఇలాంటి ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని ఇలాంటివారు అమాయకమైన ప్రజలను టార్గెట్ చేస్తూ మార్కెట్ రేటు కంటే తక్కువ రేటు కి బంగారం ఇస్తామని నమ్మబలుకుతూ, ముందుగా కొంత అసలు బంగారం అసలు నోట్లను చూపించి వారికి నకిలీ బంగారాన్ని ముట్ట జేపుతూ ప్రజలను మోసం చేస్తారని కావున ఇలాంటి వారితో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని, ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని విడిచి పెట్టమని మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం కేసు సేవించిన ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ లందరికీ జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేస్తూ, రివార్డు కొరకు పై అధికారులకు సిఫారసు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ధర్మవరం ఎస్డిపిఓ టి.శ్రీనివాసులు గారు, ధర్మవరం వన్ టౌన్ సిఐ టి. సుబ్రహ్మణ్యం గారు, ముదిగుబ్బ సీఐ కంబగిరి రాముడు గారు, ఎస్బి సిఐ రవీందర్ రెడ్డి గారు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.