యూనిట్

నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్టు

కడప నగరంలో నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ కే.కే.ఎన్‌ అన్బురాజన్‌ తెలి పారు. కేసు వివరాలను వెల్లడిం చారు. కడప భాగ్యనగర్‌ కాలనీకి చెందిన చింపిరి సాయిక్రిష్ణ, కెమెరున్‌ దేశానికి చెందిన ఎంబీఐ ఆదోల్ఫ్‌అషు, అకో బ్రోన్సన్‌ బెంగూళురులో నివాసం వుంటున్నారు. వైజాగ్‌కు చెందిన పంగి దాసు బాబు, కుర్రా జగన్నాధ్‌ లు అయిదుగురు ఒక ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. వీరు కడపలోని ఒక లాడ్జిని కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నారని సమాచారం పోలీసులకు సమాచారం అందగా వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వారు నకిలీ కరెన్సీతో పాటు గంజాయి అక్రమ రవాణా కూడ ఆచేస్తున్నట్లు తెలిపారు. కేరళ నుంచి 'స్పందన' కార్యక్రమానికి వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు మరియు భాగ్యనగర్‌ కాలనీకి చెందిన ముండ్ల జనార్దన్‌ ఇచ్చిన ఫిర్యాదులతో నిఘా ఏర్పాటు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముఠాలోని అయిదుగురను అరెస్టు చేసి వారి నుంసి రూ.7.28 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు, 9 కిలోల గంజాయి, మూడు ల్యాప్‌టాప్‌లు, కలర్‌ ప్రింటర్‌, ఏడు సెల్‌ఫోన్లు, రూ. 9,600/- నగదు మరియు ఇద్దరి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో మంచి పనితీరు కనబర్చిన కడప డిఎస్పీ సూర్యనారాయణ, చిన్న చౌకు సి.ఐ అశోక్‌ రెడ్డి, ఎస్సైలను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

వార్తావాహిని