యూనిట్
Flash News
మరాథాన్ రన్‌ను ప్రారంభించిన అదనపు ఎస్పీ
పోలీస్
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్
ఆధ్వర్యంలో మరాథాన్ రన్‌ను నిర్వహించారు. ఈ మరాథన్ రన్‌ను అదనపు ఎస్పీ బి.శరత్
బాబు జెండా ఊపి ప్రారంభించారు. మరాథాన్ రన్ కలెక్టరేట్ నుండి సంఘమిత్ర మీదుగా
సమ్మర్ స్టోరేజి ట్యాంక్, మంగమూరు
రోడ్ జంక్షన్ తాలూకా మీదుగా జిల్లా పోలీస్ కళ్యాణ మండపం వరకు నిర్వహించారు. ఈ
సందర్భముగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా
వ్యాప్తంగా ఓపెన్ హౌస్ నిర్వహించి విద్యార్ధులకు పోలీస్ విధులు, ఆయుధాలకు సంబంధించిన వివరాలను తెలిపామన్నారు. విద్యార్ధులకు వ్యాసరచన,
డిబేట్‌లను నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు
డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్, ఏ.ఆర్.డిఎస్పీ
ఎ.రాఘవేంద్ర రావు, ట్రాఫిక్ డిఎస్పీ కె.వేణుగోపాల్,
ఎస్బీ సి.ఐ ఎన్.శ్రీకాంత్‌బాబు, సి.ఐలు
భీమా నాయక్, యం.రాజేష్, లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు