యూనిట్

పోలీసుకు వ్యాయామం నిత్యకృత్యం అవ్వాలి : డిజిపి

డిసెంబర్‌ 28న రాష్ట్ర డి.జి.పి. శ్రీ నండూరి సాంబశివరావు గారు మంగళగిరి బెటాలియన్‌లో అధునాతనమైన పోలీస్‌ వ్యాయామశాలను ప్రారంభించారు. ఈ వ్యాయామశాలలో ఉత్తమమైన వ్యాయామ పరికరాలు, స్టీమ్‌బాత్‌ సదుపాయం మరియు బాడీ మసాజ్‌ సదుపాయం కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా డి.జి.పి గారు మాట్లాడుతూ వ్యాయామం ప్రతి పోలీసుకు అవసరమని ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని అనుదినం అలవాటుగా మార్చుకోవాలి అని అన్నారు. ఇదే సముదాయంలో కొత్తగా నిర్మించిన ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును, సింతటిక్‌ టెన్నిస్‌ కోర్టును ప్రారంభించారు. తదుపరి పోలీసు వెల్‌ నెస్‌ సెంటర్‌ను (ఫిజియోథెరఫీ విభాగాన్ని) డి.జి.పి ప్రారంభించారు.పై నాలుగు సముదాయాలను నిర్మించడంలో ఆశక్తి కనపరిచి అద్భుతంగా తీర్చిదిద్ధిన ఎ.పి.యస్‌.పి బెటాలియన్స్‌ ఐ.జి. రాజీవ్‌ కుమార్‌ మీనాను డి.జి.పి.గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిజిపిలు ఎన్‌.వి. సురేంద్రబాబు, హరీష్‌ కుమార్‌ గుప్త, సి.హెచ్‌.డి. ద్వారాక తిరుమల రావు, శ్రీమతి అంజనాసిన్హా , ఐ.జి.పి.లు యన్‌. శ్రీధర్‌ రావు, అమిత్‌ గార్గ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని