యూనిట్
Flash News
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోవివిధ పోలీస్ విభాగాల సిబ్బంది రక్తదానం చేయడం సంతోషంగా వుందన్నారు. ఆరోగ్యవంతమైన యువత కూడా రక్తదానం చేయడం శభపరిణామమన్నారు. రక్తదాన శిబిరంలో మొత్తంగా 113 మంది రక్తదానం చేసారు. కార్యక్రమంలో రిమ్స్ వైద్యశాఖ వైద్యులు శ్రీకాంత్, రెడ్ క్రాస్ సభ్యులు డా.చిట్టిబాబు, పెంకి చైతన్య కుమార్, ప్రకాశ్, జగన్నాధం, డిఎస్పీలు చక్రవర్తి, ఎన్.వి.వి.శేఖర్, కృష్ణవర్మ, ఆర్.ఐలు కోటేశ్వరబాబు, రవికుమార్, మూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.