యూనిట్

మహిళల భద్రతకు భరోసా కల్పించాలి

పోలీసు శాఖ, మహిళా అభివృద్ది & స్త్రీ , శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు  ఏలూరు కు సమీపంలోని పెదవేగి దగ్గర గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో రెండు వారాల పాటు శిక్షణ తరగతులు  జనవరి 06 వతేది నుండి జరుగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా 104 మంది మరియు కృష్ణ జిల్లా 127  మంది  మొత్తంగా  231 మంది శిక్షణ పొందనున్నారు. 

ఈ సంధర్బంగా  డి.టి.సి ఇంఛార్జి డి.యస్.పి  మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ పైడేశ్వర రావు  మాట్లాడుతూ...గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీసుశాఖలో ఒక భాగమేనని అన్నారు. క్రమశిక్షణ పోలీసుశాఖకు  చాలా అవసరమన్నారు. ఒక పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే గ్రామాలకు తగినంత పోలీసు సిబ్బంది లేరని, అందులో కొంతమంది సిబ్బంది బందోబస్తులకు  వెళ్తున్నారన్నారు. 

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  గారు క్షేత్రస్థాయిలో  పని చేసే ఒక మంచి అవకాశాన్ని వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు కల్పించారన్నారు. కేటాయించిన విధులను బాగా నిర్వర్తించాలన్నారు.  మహిళల భద్రతకు అందరూ బాగా పని చేయాలన్నారు. మహిళల పై  నేరాలు జరగకుండా చేయాలన్నారు. గ్రామాల్లో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరగకూడదన్నారు. సమస్యలునా ప్రతి మహిళా బాధితురాలికి  మహిళా సంరక్షణ కార్యదర్శులు అండగా ఉండి, దైర్యం కల్పించాలన్నారు. కౌన్సిలింగ్ చేయాలన్నారు. అవసరమైతే సంబంధిత లోకల్ ఎస్సైల సహకారం  తీసుకోవాలన్నారు.  ఐసిడిఎస్ విధులను కూడా బాగా నిర్వర్తించాలన్నారు. 2 వారాల శిక్షణ కాలంలో  మీరు చేసే  విధుల గురించి బాగా  అవగాహన చేసుకోవాలన్నారు.

శిక్షణ కేంద్రంలో మంచి వాతావరణం కల్పించామని, ప్రస్తుతం  కేటాయించిన పోస్టింగ్ లు మూడు సంవత్సరాల వరకు మారవని తెలియజేసారు. ఎల్ ఈ డి డిస్ ప్లే లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా అందరి ఎదుటనే  పారదర్శకంగానే పోస్టింగ్ లు ఇచ్చామన్నారు. ఎక్కడ విధులు కేటాయించారో అక్కడ నిజాయితీగా పని చేయాలని, 2 సంవత్సరాల పాటు ప్రోబేషనరీ పిరియడ్ ఉంటుందన్నారు.  సర్వీస్ రూల్స్ ఉంటాయని, క్రమశిక్షణ తప్పకుండా  పని చేసి  మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో    సిఐలు రామారావు, ఆర్ ఐ యస్. ఐ లు   పాల్గొన్నారు.

వార్తావాహిని