యూనిట్
Flash News
సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి- అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు
సైబర్ నేరాల భారిన పడకుండా ప్రజల్లో విస్తృతంగా
అవగాహన తీసుకురావాలని... అదే సమయంలో నైపుణ్యాలు పెంచుకుని జరిగిన సైబర్ నేరాలను
ఛేదించాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు
కాన్ఫరెన్స్ హాలులో" సైబర్ నేరాలపై అవగాహన సదస్సు" నిర్వహించారు. జిల్లాలో
సాంకేతిక విభాగంతో అనుసంధానించి పని చేసే అధికారులు, సిబ్బందితో
నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్
నేరాలపై అవగాహన మరియు ఛేదింపునకు అవసరమయ్యే మెళకువలు, ముందు
జాగ్రత్తలు గురించి ఎస్పీ వివరించారు.
ఓటీపీ, జాబ్, ఇ-మెయిల్,
లక్కీ డ్రా, లాటరీ ఫ్రాడ్స్ జరగడం ప్రస్తుత
పరిస్థితుల్లో సర్వసాధారణమైందని,వీటితో ప్రజలు నిత్యం
మోసపోతూనే ఉన్నారన్నారు. సైబర్ మోసాలు జరిగిన వెంటనే బాధితులు కూడా ఆలస్యం
చేయకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సైబర్ నేరం భారిన పడినట్లు బాధితులు
మనల్ని సంప్రదిస్తే వెంటనే స్పందించాలని చెప్పారు. ముందుగా బాధితులకు సంబంధించిన
సమగ్ర వివరాలు తీసుకుని లావాదేవీలు జరిపిన వెండర్ల దృష్టికి తీసుకెళ్లాలని,
అదే సమయంలో సైబర్ నేరగాళ్లు జరిపిన లావాదేవీల వివరాలు సేకరించి వెండర్లకు పంపాలని
తెలిపారు. సైబర్ నేరగాళ్లు జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఆన్ లైన్ పేమెంట్లను
వెంటనే నిలుపుదల చేయించేట్టు, వీలయితే ఆ డబ్బును తిరిగి
బాధితుల ఖాతాల్లో జమ చేయించేలా కృషి చేయాలని స్పష్టం చేసారు.
రాష్ట్ర
సి.ఐ.డి విభాగం నుండీ వచ్చిన అధికారులు సైబర్ నేరాల ఛేదింపు, నియంత్రణకు
సంబంధించి పలు మెళకువలు, జాగ్రత్తలు గురించి క్షుణ్ణంగా
వివరించారు. ఈ సదస్సులో అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు, ట్రైనీ
ఐ.పి.ఎస్ అధికారి మణికంఠ చండోలు, పలువురు ఎస్ ఐ లతో పాటు
జిల్లాలోని క్యాట్ (CAT) టీమ్స్ , సైబర్
, ఐ.టి కోర్ టీం, ఈ సర్వేలెన్స్ ,
తదితర సాంకేతిక పరిజ్ఞాన విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.