యూనిట్
Flash News
పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఏలూరు రేంజ్ డి ఐ జి
ఏలూరు రేంజ్
డీఐజీ జీవీజీ. అశోక్ కుమార్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,జిల్లా
పోలీస్ కార్యాలయం ను సందర్శించారు. డి ఐ జి ని
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ యు
రవిప్రకాష్ పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా
ఆహ్వానం పలికారు. జిల్లాలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు , సెబ్ అడిషనల్ ఎస్పీ ఏ
టీవీ రవికుమార్ , భీమవరం
డిఎస్పి బి శ్రీనాథ్ , నరసాపురం
డి.ఎస్.పి మనోహర చారి , తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి శరత్ రాజ్ కుమార్మ రియు జిల్లా
అధికారులందరూ డిఐజి స్వాగతం పలికారు.
డీఐజీ జిల్లా పోలీస్ కార్యాలయంలోని
ఆర్మూడి విభాగాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని దిశ పోలీస్ స్టేషన్,ఎస్
బి కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం
విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో
జిల్లా పోలీసు అధికారులు అందరితో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. డీఐజి
సమీక్ష అనంతరం మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని
అదేవిధంగా ప్రాపర్టీ కేసులు రికవరీ కూడా బాగుందని, హెల్మెట్రు
డ్రైవ్ ప్రతిరోజు జిల్లా అంతా నిర్వహించడం
అనేది మంచి కార్యక్రమం అన్నారు. మాదగద్రవ్యాల కేసులలో గత నాలుగు సంవత్సరాల నుంచి
స్టేషన్లలో నమోదు అవుతున్న వారి వివరాలను సేకరించి ప్రస్తుతం వారి మీద నిఘా
ఉంచాలన్నారు. వారు వేరే స్టేషన్లో గాని ఎక్కడైనా నేరాలు చేయుచున్నట్లయితే ఆ
స్టేషన్లో కూడా తెలిపి వారి మీద హిస్టరీ సీట్లు ఓపెన్ చేయాలని మరియు పీడీ యాక్ట్
లు పెట్టాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో అన్ని ముఖ్యమైన గ్రామాలలో శాంతి
కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రెవెన్యూ మరియు గ్రామ పెద్దలతో సమావేశాలు
నిర్వహిస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు.