యూనిట్

పటాలములో మౌలిక వసతుల కల్పనకు కృషి

పటాలములో మౌలిక వసతుల కల్పనకు కృషి 2వ పటాలములో డిఐజి సి.హెచ్‌. వెంకటేశ్వర్లు వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పటాలములోని ఆయుధగారాన్ని సందర్శించి, పలు ఆయుధాలను పరిశీలించారు. పటాలములో సిబ్బంది సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. వీలైనంత వరకు తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కమాండెంట్‌ ఎస్‌.కె.హుసేన్‌సాహెబ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని