యూనిట్
Flash News
సమర్థవంతంగా ఛలో ఆత్మకూరు నిరసన నిలుపుదల : డిజిపిగారు
తీవ్ర శాంతి భద్రతల సమస్యకు
దారి తీసే అవకాశం ఉన్న చలో ఆత్మకూరు నిరసన కార్యక్రమాన్ని ముందు జాగ్రత్త చర్యలు
చేపట్టడం ద్వారా పోలీసులు సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. రెండు ప్రధాన రాజకీయ
పక్షాలు అయిన వైసీపీ, టీడీపీలు
ఈ చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న
విషయం విదితమే. గుంటూరు రేంజ్ ఐజీపీ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో
గుంటూరు అర్బన్, రూరల్ పోలీసులు ఇరుపార్టీల ముఖ్య
నాయకులను గ్రుహనిర్బంధం, బయటి జిల్లాల నుండి వచ్చే నాయకులను, కార్యకర్తలను
ముందస్తుగానే అడ్డుకోవడం వంటి చర్యలతో కార్యక్రమం విఫలం చేశారు. గుంటూరు బాధిత
శిబిరాలలో ఉన్నవారిని పోలీస్ వాహనాలలో భద్రంగా ఆత్మకూరు తరలించి, సఖ్యత, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించారు.
ఎటువంటి అలజడులకు ఆస్కారం లేకుండా పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున
తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా
సమన్వయంతో పరిష్కరించినందుకు రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు ఇందుకు
కృషిచేసిన ఐజీపీ వినీత్ బ్రిజ్‌లాల్, గుంటూరు అర్బన్
ఎస్పీ పి.హెచ్.డి. రామకష్ణ, రూరల్ ఎస్పీ శ్రీమతి ఆర్.
జయలక్ష్మిల ఆధ్వర్యంలోని బందోబస్తు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.