యూనిట్
Flash News
సులువుగా సైబర్ నేరాలపై ఫిర్యాదు
నానాటికీ తీవ్రమౌతున్న సైబర్ నేరాలపై మహిళలు అవగాహన పెంపొందించుకొని వాటి బారినుండి రక్షణ పొందవలసినదిగా హోంశాఖమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత మహిళలకు పిలుపునిచ్చారు. ఇటువంటి నేరాలకు గురి అయ్యే మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండానే 91212 11100 నంబర్‌కు వాట్సాప్ చేయడం ద్వారా ఫిర్యాదు చేసి తక్షణమే తగు రక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. ఇటువంటి వాటిలో ఫిర్యాదిదారుల వివరాలు వెల్లడికాకుండా తగు చర్యలు తీసుకోబడతాయన్నారు. రాష్ట్ర మహిళా కమీషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన 'మహిళలపై సైబర్ నేరాలు - నియంత్రణ' అంశంపై జరిగిన కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల్లో 52 శాతం మహిళా సంబంధితమైనవే వుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 11 వేల కేసులు నమోదు చేయగా అందులో 60 శాతం మహిళా సంబందిత నేరాలేనని తెలిపారు. సాంకేతికత సహాయంతో మహిళా రక్షణకు మరిన్ని ఆధునిక విధానాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సైబర్ నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించగలిగినప్పుడే వీటికి సమర్థంగా కట్టడి చేయగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం బాలిక, మహిళా రక్షణకు కంకణబద్దమై ఉన్నదని, అందుకనుగుణంగా మన వంతు పూర్తి మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహిళలపైసైబర్ నేరాలు - నియంత్రణ చర్యలపై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు.