యూనిట్

సిబ్బంది సమస్యలపై దర్బార్‌

పిటిఓ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఐజిపి కె. సత్యనారాయణ మంగళగిరిలోని పిటిఓ ప్రధాన కార్యాలయం నందు దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భముగా ఐజిపి మాట్లాడుతూ సిబ్బందికి ఎటువంటి సమస్యలు వున్నా నేరుగా తన దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి నెల దర్బర్‌ నిర్వహిస్తానని పేర్కొన్నారు. పిటిఓ లోని సిబ్బంది తమ సమస్యలను విన్నవించుకోగానే సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను సూచించి వెంటనే చర్యలు తీసుకోమని తెలిపారు. కార్యక్రమంలో పి.టి.ఓ డిఎస్పీ కె. కోటేశ్వర రావు, ఎం.టి.ఓ బి. వాసు, ఎ.ఎం.టి.ఓ మునగాల కేశవ రావు, ఎస్సైలు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రసాద్‌, పుల్లా రెడ్డి, బాలాజి, జోజి రెడ్డి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని