యూనిట్

విద్యార్థినులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ స్నేహిత

విద్యార్థినులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డి గూడెం డీఎస్పీ శ్రీమతి ఎం. స్నేహిత అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం లోని సి. ఎస్. టి. ఎస్  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 'మహిళల పై జరుగుతున్నదాడుల పై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మహిళలకు, విద్యార్థినులకు సమస్య గని, ఆపద గని వస్తే వెంటనే డైల్ - 100 , డైల్ - 112 , దగ్గరలో ఉన్న పోలీస్ స్టేటన్ కు లేదా మీకు బాగా తెల్సిన వారికీ సమాచారం అందించాలన్నారు. వెంటనే మీ స్మార్ట్ ఫోన్ తో లొకేషన్ షేర్ చేయాలన్నారు. మాయ మాటలకూ నమ్మి జీవితాలను నాశనం చేసుకోరాదని సూచించారు. కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం సి ఐ బి. ఎన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

వార్తావాహిని