యూనిట్

డ్రైవర్లకు విశ్రాంతి అవసరం

డ్రైవర్లకు విశ్రాంతి అవసరం పోలీస్‌ శాఖలోని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెక్షన్‌లో పనిచెసే డ్రైవర్లకు విశ్రాంతి ఎంతో అవసరమని సౌత్‌ కోస్టల్‌ జోన్‌ ఐజిపి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ అన్నారు. నెల్లూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఎమ్‌.టి సెక్షన్‌ డ్రైవర్ల విశ్రాంతి గది, వెహికల్‌ షెడ్‌లను ఐజిపి ప్రారంభించిన సందర్భముగా మాట్లాడారు. రాత్రింబవళ్లు పనిచేసే డ్రైవర్లకు విశ్రాంతి కల్పించాలని తలచి ఈ విశ్రాంతి గదులను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీని అభినందిస్తున్నానన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమం మరియు వెహికల్స్‌ పార్కింగ్‌ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోనే మొదటిసారిగా వెహికల్‌ షెడ్‌ మరియు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఐజిపి పోలీస్‌ కార్యాలయం ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరభద్రుడు, డిఎస్పీలు ఎన్‌.కోటారెడ్డి, జె.శ్రీనివాసుల రెడ్డి, కె.వి.రాఘవ రెడ్డి, లక్ష్మినారాయణ, యం.శివప్రసాద్‌, మల్లికార్జున, రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని