యూనిట్

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

 పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయము లో గల  కాన్ఫరెన్స్ హాలు నందు ఆదివారం   పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ   నవదీప్ సింగ్ గ్రేవాల్   నిర్వహించారు. ఈ నేర సమీక్షా సమావేశం లో  జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సర్కిల్ వారీగా జిల్లా ఎస్పీ గారు  సమీక్షించారు.  స్పందన కార్యక్రమములో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే విచారించి ఫిర్యాదిదారులకు న్యాయం చేకూరేలాగా చేయాలి.  డయల్ 100 కు మరియు వాట్సాప్  నెంబర్ 9550351100 లక్  వచ్చే కాల్స్ మరియు మెసేజ్ లకు వచ్చే  ఫిర్యాదులపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ లు వెంటనే స్పందించి నేర స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.  

                        ఈ నేర సమీక్షా సమావేశం లో ట్రైనింగ్ ఐపీఎస్   కృష్ణ కాంత్. ఎస్‌బి డి‌ఎస్‌పి  .  శ్రీనివాస చారి  జిల్లాలోని డి‌.ఎస్‌.పిలు  డాక్టర్  ఓ.దిలీప్ కిరణ్ , కే రాజేశ్వర్ రెడ్డి,   కె.నాగేశ్వరరావు,     ఎం.వెంకటేశ్వరరావు ,   పైడెశ్వరావు,     డి‌ఎస్‌పి.  ఏ. శ్రీనివాసరావు,  వి. సుబ్రమణ్యం , మరియు జిల్లాలోని అందరు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు హజరైనారు.

వార్తావాహిని