యూనిట్
Flash News
లక్ష మొక్కలు నాటడమే జిల్లా పోలీసు లక్ష్యం

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఎస్.పి. అద్నాన్ నయీమ్ అస్మీ ఆధ్వర్యంలో 'వనం-మనం' కార్యక్రమం జరిగింది. ముందుగా ఎస్.పి. మొక్క నాటి నీరు పోశారు. అనంతరం ఎస్.పి. మాట్లాడుతూ జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపడుతామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. అలాగే కాకినాడ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 120 మంది పోలీసు సిబ్బందికి మొక్కల రక్షణ పరికరాలను ఎస్.పి. అందజేశారు. కాకినాడ సీపోర్ట్ ఎస్‌ఆర్‌ఎంటి, కిరణ్ కంటి ఆసుపత్రి వారు సమకూర్పిన రేడియం జాకెట్లు, జంగిల్ షూస్, లెడ్ బటన్స్‌ను ఎస్.పి. సిబ్బందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి. శ్రీధరరావు, ఓఎస్‌డి చక్రవర్తి, డిఎస్‌పిలు మురళీమోహన్, ఎస్‌వి అప్పారావు, పి.రామకృష్ణ, ట్రాఫిక్ డిఎస్‌పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులను జ్ఞాపికలతో సత్కరించారు.