యూనిట్
Flash News
విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు పంపిణీ
గుంటూరు
జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు పిల్లలు ఇటీవల విడుదలైన
పరీక్షల్లో ప్రతిభావంతమైన మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎస్.వరదరాజులు
చేతులమీదుగా విద్యార్థులకు మంజూరైన మెరిట్ స్కాలర్‌షిప్స్‌ను 182 మందికి రూ. 21,96,000/- రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ స్సందర్భముగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ
ఎస్పీ శ్రీమతి ఆర్. జయలక్ష్మి తరపున పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు
శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు పిల్లలు అందరూ నైతిక విలువలు కలిగి ఉండాలని,
తల్లిదండ్రులు, పెద్ద వాళ్ళు చెప్పిన మాటలను
విని వాటిని ఆదర్శముగా తీసుకొని ప్రజల పట్ల, సమాజము పట్ల
గౌరవము కలిగి ఉండాలన్నారు. మంచి నడవడికతో కూడిన ప్రవర్తనతో వద్ధిలోకి వచ్చి
తల్లిదండ్రులకు సమాజములో మంచి పేరు తీసుకు రావాలని సూచించారు.కార్యక్రమములో అదనపు
ఎస్పీలు ఎన్.వి.ఎస్.మూర్తి, ఎస్.వి.డి. ప్రసాద్, డిఎస్‌పి లక్ష్మయ్య, అసోసియేషన్ ప్రెసిడెంటు
మాణిక్యాలరావు, అసొసియేసన్ సభ్యులు పాల్గొన్నారు.