యూనిట్

పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి భీమా బాండ్‌ల పంపిణీ

పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి భీమా బాండ్‌ల పంపిణీ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి భీమా సౌకర్యము కల్పించడమన్నది గొప్ప విషయమని డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ ప్రశంసించారు.పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి భీమా సౌకర్యాన్ని అందించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడ గేట్‌ వే హోటల్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపి పోలీస్‌ కార్పొరేషన్‌ నిర్మాణాల పనితనాన్ని చూసి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ , సాంఘిక సంక్షేమ శాఖ , శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వంటి సంస్థలు తమ నిర్మాణాలు కూడా చేపట్టామని ముందుకు రావడం సంస్థ అంకితభావం,సమర్థతకు నిదర్శనం అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కార్పొరేషన్‌ టర్నోవర్‌ భారీగా పెరిగిందని, ఇందుకు కారకులైన వైస్‌ చైర్మన్‌ శ్రీ పి వి సునీల్‌ కుమార్‌ మరియు వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీ పి వి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ..కార్పొరేషన్‌ సిబ్బంది కి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎప్పటికప్పుడు డిజిపి శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారు అడిగి తెలుసుకుంటుంటారని, ఇది వారు సిబ్బంది సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. బ్యాంక్‌ లు పర్మినెంట్‌ వారికే తప్ప ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి భీమా సౌకర్యం కల్పించడానికి విముఖత చూపుతున్న తరుణంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తో ఒప్పదం కుదుర్చుకొని 150మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి భీమా అందించామన్నారు. ఇటీవల హరికష్ణ అనే ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వపరంగా ఎటువంటి సాయం అందించలేకపో యామని, తోటి సహోద్యోగులు కలిసి ఏడు లక్షలు సేకరించగా , విషయం తెలిసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఐదు లక్షలు మంజూరు చేసారని చెప్పారు. ఇప్పుడు కనుక అటువంటిది సంభవిస్తే 20 లక్షలు భీమా సాయంగా అందుతుందన్నారు. పోలీస్‌ శాఖ నిర్మాణాలు మాత్రమే కాకుండా ఇతర సంస్థల నిర్మాణాలను చేపట్టి కార్పొరేషన్‌ మంచి పేరు గడిస్తున్నదని, సిబ్బంది సహాయ సహకారాలతో భవిష్యత్‌ లో మరింతగా అభివద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తపరిచారు.

వార్తావాహిని