యూనిట్
Flash News
వినాయక మట్టివిగ్రహాలు పంపిణీ
వినాయక
మట్టివిగ్రహాలు పంపిణీ ''పర్యావరణ
పరిరక్షణ''లో భాగంగా మరియు ''ఎకో
ఫ్రెండ్లీ పోలిసింగ్''లో భాగంగా పోలీస్ అధికారుల సంఘం,
గుంటూరు రూరల్ జిల్లా అధ్వర్యంలో వినాయక చవితి పండుగకు మట్టి గణపతి
విగ్రహాలను గుంటూ రు రూరల్ జిల్లా ఎస్పీ శ్రీమతి ఆర్. జయలక్ష్మి పంపిణీ చేశారు.
దాదాపుగా 1100ల మట్టి గణపతి విగ్రహాలను పోలీస్ కళ్యాణ మండపం
వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమములో పోలీస్ సిబ్బందికి, పట్టణ
ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అదనపు ఎస్పీ కే. చక్రవర్తి,
సీఐ సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారుల సంఘం
ప్రెసిడెంట్ టి. మాణిక్యాల రావు,పోలీస్ అధికా రుల సంఘం
మాజీ స్టేట్ జనరల్ సెక్రటరి డి. సుబ్రహ్మణ్యం గారు జే.వెంకటేశ్వ రరావు, బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొనారు.