యూనిట్

విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు తలపెట్టిన 'రాజన్న బడిబాట' కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా 11వ పటాలం ఆవరణలో జడ్పీ పాఠశాలకు 21 సైకిళ్లను మంజూరు చేయడం జరిగింది. సైకిళ్ళను కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు విద్యార్థినులను అందజేశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రిగారి ఎంతో ఉన్నతంగా ఆలోచించి బాలికలు అందరూ చదువుకోవడానికి, ప్రయాణంలో ఎటువంటి ఆటకం కలగరాదనే ఉద్దేశ్యంతో ఈ సైకిళ్లను ఇవ్వడం జరిగిందన్నారు. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కమాండెంట్‌ సూచించారు. కార్యక్రమంలో ఆర్‌.ఐ. ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని