యూనిట్

కృష్ణ జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఒంగోలు డిఎస్పీగా పనిచేసి బదిలీపై కృష్ణా జిల్లా దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఉప్పుటూరి నాగరాజు  జిల్లా ఎస్పీ  పి.జాషువా  ని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ  దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పిని అభినందించి, రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర డీజీపీ శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి  గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత మరియు రక్షణకు మొదటి ప్రాధాన్యత నివ్వాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను నివారించటంలో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, చిన్న చిన్న గొడవల వల్ల స్టేషన్ కు వచ్చే బాధితులను మరియు ప్రతివాదులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి జీవితాలలో వెలుగు నింపాలన్నారు. అదేవిధంగా గతంలో మహిళలపై జరిగిన నేరాలలో విచారణ వేగవంతం చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని దిశా నిర్దేశం చేసినారు.

వార్తావాహిని