యూనిట్
Flash News
నిజాయితీగా పని చేసి, నిస్వార్థంగా ప్రజలకు సేవలందించాలి: డి ఐ జి
నిజాయితీగా
పని చేసి ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు తెలిపారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు
పోలీసు కార్యాలయం, మోటార్ ట్రాన్స్‌ఫోర్టు, నేర రికార్డుల బ్యూరో, స్పెషల్ బ్రాంచ్‌ల వార్షిక
తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన జిల్లాకు వచ్చారు. పరేడ్ మైదానంలో పోలీసుల నుంచి
గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి
పెట్టాలని, చెడు అలవాట్లు, వ్యసనాలకు
లోను కావద్దని సూచించారు. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్వయం
చేసుకుంటూ పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఏఆర్ సిబ్బంది నిర్వహించిన
పలు ప్రదర్శనలను తిలకించారు. డీసీఆర్‌బీలో భద్రపర్చిన దస్త్రాలను పరిశీలించి
సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ
శ్రీమతి బి.రాజకుమారి, ఓఎస్‌డీ
జె.రామ్మోహన్‌రావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్‌బీ డీఎస్పీ సీఎం నాయుడు, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహన్‌రావు,
ఎస్‌బీ సీఐలు కె.దుర్గాప్రసాదరావు, ధనుంజయనాయుడు,
సీఐ బి.వెంకటరావు, ఆర్‌ఐలు శ్రీహరిరావు,
రమణమూర్తి, గురునాధరావు తదితరులు
పాల్గొన్నారు.