యూనిట్
Flash News
వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుపై సిట్ బందంతో డి.జి.పి.గారి సమీక్ష
మాజీ మంత్రి
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు విచారణను
సిట్‌కు అప్పగించారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్
కడప ఎస్.పి. కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు హత్యకేసుపై
విచారణ చేస్తున్న సిట్ బృందంతో సమావేశమై కేసు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో
కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామి రెడ్డి, కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి పాల్గొన్నారు.
దర్యాప్తు పురోగతిపై రాష్ట్ర డి.జి.పి. శ్రీ గౌతమ్ సవాంగ్‌గారు 'సిట్' బృందంతో కేసుపై
పలు విషయాలను తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) లక్ష్మి నారాయణ, సిట్ బృందం
లోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.