యూనిట్

ప్రజాస్వామ్య బద్దంగా సభలు, ర్యాలీలు చేసుకోవాలి

గుంటూరు అర్బన్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు గుంటూరు నగర పరిధిలో ఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలవారితో గుంటూరు అర్బన్ అదనపు ఎస్.పి (పరిపాలన) ఇన్చార్జి మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి బి సీతారామయ్య, పశ్చిమ డిఎస్పి బివి రామారావు గార్ల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాలకు హాజరుఅయ్యే విషయాల్లో అవగాహన కల్పిచుట కోసమై  సమావేశం నిర్వహించడం జరిగింది.

 ఈ సమావేశంలో గుంటూరు నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్ చట్టం మరియు సెక్షన్ 144 సిఆర్పిసి అమలులో ఉన్నందున సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించుకోవాలని, అట్టి కార్యక్రమాల నిర్వహించ దలచిన వారు ముందస్తుగా సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అనుమతులు పొంది అట్టి కార్యక్రమాలు సూచించిన నిబంధనల మేరకు నిర్వహించుకోవాల్సి  ఉంటుందని, అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు వంటి  నిరసన కార్యక్రమాలు ఎవ్వరూ నిర్వహించరాదని, ఉల్లంఘించిన వారిపై చట్ట బద్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కనుక  విద్యా సంస్థల వారు తమతమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులను ఈలాంటి నిరసన కార్య క్రమాల్లో పాల్గొనే విషయాల్లో వారికి అవగాహన కల్పించ వలసిందిగాను మరియు అనుమతి లేని నిరసన కార్యక్రమాలలో పాల్గొనరాదనిఉల్లంగించిన సందర్భంలలో చట్టబద్దమైన చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకొంటారని వారలకు అవగాహన కల్పిచాలని, అదేవిధంగా యాజమాన్యాలు విద్యార్థినీ విద్యార్థులకు బస్సులు వగైరాలు సమకూర్చి, అనుమతుల్లేని నిరసన కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు ప్రోత్సహించ రాదని, ఆ విధంగా చేసే విద్యాసంస్థల పైన కూడా సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియ జేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాత గుంటూరు సీఐ అర్ సురేష్ బాబు, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని