యూనిట్

సిసి కెమెరాలతో నేరాలను నిరోధించవచ్చు: తూర్పుగోదావరి ఎస్పీ

సి సి కెమేరాల వినియోగం వల్ల నేరాలను నిరోదించడంలో గాని, పరిశోధనలో గాని బాగా   ఉపయోగాపడుతున్నాయని  తూర్పు గోదావరి ఎస్పీ అద్నాన్ నయిం అస్మి అన్నారు. Andhra Pradesh Public Safety (Measures) Enforcement Act- 2013  ప్రకారం  జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్, అపార్ట్ మెంట్లు , మసీదులు, దేవలయాలు, ఇతర ప్రార్దనా మందిరాలు, క్రీడా  ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువమంది సంచరించే ప్రదేశాలలో మరియు పార్కింగ్ ప్రదేశాలలో  సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. సి సి  పుటేజ్ లు 30 రోజులు వరకు ఉండే సామర్ద్యం కలిగిన సామగ్రిని సమకూర్చుకోవాలని   సూచించారు. అదేవిధంగా ఈ చట్ట ప్రకారం ఆరు నెలలకు ఒకసారి సంబంధిత యాజమాన్యాలు వారి పరిధిలోని పొలీస్ ఇన్ స్పెక్టర్ కి సి సి  కెమేరాల పనితీరు గురించి నివేదిక పంపాలి. సంబంధిత పోలీస్ ఇన్ స్పెక్టర్  ఎప్పుడైనా చెక్ చేసే అధికారం ఉంది. ఎక్కడైనా లోపాలు ఉంటే  సంబంధిత  డి.యస్.పి. కి   సి.ఐ.   రిపోర్టు పంపుతారు. దానిపై డి.యస్.పి.    సంబధిత యాజమాన్యాలకు షోకాజ్ నోటిసు ఇచ్చి , దానికి స్పందించిక పొతే అటువంటి వారికి  మొదట సారి Rs. 5,000/- రూపాయలు రెండవసారి Rs. 10,000/- రూపాయలు జరిమానా విధిస్తారు. రెండు నెలల తర్వాత కూడా ఏర్పాటు చేయకపోతే  చర్యలు తీసుకోనబడుతాయి అని పేర్కొన్నారు.

వార్తావాహిని