యూనిట్
Flash News
ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన కానిస్టేబుల్ నియామక ఫలితాలు
చాలా కాలంగా పోలీస్
ఉద్యోగార్థులు ఎదురు చూస్తు న్న కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలు వెల్లడించి
వారిలో ఆనందాలను నింపింది పోలీస్ శాఖ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్
రెడ్డి గారు తాడేపల్లిలోని తమ నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు, డీజీపీ శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు, పోలీస్
రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్‌లు పాల్గొన్నారు. గత ఏడాది 2,723 కానిస్టేబుల్ పోస్ట్‌ల భర్తీకి పోలీస్ రిక్రూటమెంట్ బోర్డు
నోటిఫికేషన్ జారీ చేయగా 3,94,384 మంది దరఖాస్తు
చేసుకున్నారు. ప్రాథమిక, శారీరక ధారుడ్య పరీక్షల అనంతరం
తుది పరీక్షకు 65,575 మంది అర్హత సాధించారు. వీరిలో 2,623 ఉత్తీర్ణత సాధించి నియామకానికి ఎంపికయ్యారని, మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని హోంమంత్రిగారు తెలియజేశారు.
ఈ పరీక్షల్లో పురుషుల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జింకా శశి కుమార్ 147 మార్కులతో మొదటి స్థానంలో నిలువగా, విజయనగరం
జిల్లాకు చెందిన లక్ష్మి ప్రియాంక 138 మార్కులతో మహిళా
విభాగంలో మొదటి స్థానం పొందారు. ఎంపిక సాధించిన వారి వివరాలు రశ్రీజూతీప .aజూ .స్త్రశీఙ .ఱఅ వెబ్సైట్లో ఉంచామని రిక్రూట్ మెంట్ బోర్డు
చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. ఎంపికైన వారిలో పురుషులు 2,213 మంది కాగా 500 మంది మహిళలు కావడం విశేషం.
ఏపీఎస్పీ, ఫైర్ విభాగాలలో తప్పించి మిగతా వాటిలో వీరికి
అవకాశం కల్పించారు. వీరు సివిల్ 430, ఏఆర్ 47, జైలు మహిళా వార్డర్లు 23 మంది ఎంపికయ్యారు.
సర్టిఫికెట్స్ పరిశీలనానంతరం త్వరలోనే వారిని 9 నెలల
శిక్షణకు పంపుతామని డీజీపీ శ్రీ డి. గౌతమ్ సవాంగ్గారు తెలియజేశారు.