యూనిట్
Flash News
కానిస్టేబుల్ శిక్షణలో క్రమశిక్షణతో మెలగాలి
కానిస్టేబుల్ శిక్షణలో ఎంతో క్రమశిక్షణతో మెలగాలని ఏపీఎస్పీ
ఐజీ బి. శ్రీనివాసులు అన్నారు. విజనగరంలోని ఏపీఎస్పీ 5 వ
పటాలంలో ఎస్. సి.టి పి సి ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా
హాజరై మాట్లాడారు. పోలీస్ ఉద్యోగ జీవితం లో తొమ్మిది నెలల శిక్షణ ఎంతో ఉపయోగకరంగా
ఉంటుందన్నారు. అనంతరం విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి మాట్లాడుతూ
పోలీస్ శిక్షణ లో నేర్పించిన మెళుకువలు శ్రద్దగా నేర్చుకుంటే ఉద్యోగ సమయంలో చాల
సులభంగా విధులను నిర్వర్తించవచ్చు అన్నారు. కార్యక్రమంలో పటాలం కమాండెంట్ జె.
కోటేశ్వర రావు, విజయనగరం ఓ ఎస్ డి జె రామ మోహన రావు తదితరులు
పాల్గొన్నారు.