యూనిట్

బాస్కెట్‌బాల్‌ విజేతలకు అభినందనలు

బాస్కెట్‌బాల్‌ విజేతలకు అభినందనలు 3వ పటాలము ఆవరణలోని ఏపీఎస్‌పీ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ప్రథమస్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తికి మెమొంటోను విద్యార్థులు ఇచ్చారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఆరు టీమ్‌లు పాల్గొనగా పటాలము పాఠశాలకు చెందిన విద్యార్థులు హోరాహోరీగా పోరాడారని కమాండెంట్‌ తెలిపారు. ఇదేస్ఫూర్తిని మున్ముందు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.సత్యనారాయణ, సంక్షేమాధికారి చంద్రశేఖర్‌, పిఇటి పి.సత్యనారాయణ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

వార్తావాహిని