యూనిట్

వీడియోగ్రఫీలో స్వర్ణపతక విజేతకు అభినందనలు

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగిన 62వ అఖిలభారత పోలీస్‌ డ్యూటీ మీట్‌ - 2018లో వీడియోగ్రఫీ విభాగంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి స్వర్ణపతకం సాధించిన కమ్యూనికేషన్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ జి.వి.సుబ్బరాజుని నగర పోలీస్‌ కమీషనర్‌ ద్వారకా తిరుమల రావు అభినందించారు. ఈ సందర్భముగా కమీషనర్‌ మాట్లాడుతూ మున్ముందు ఇదేస్ఫూర్తిని వీడియోగ్రఫీ పోటీల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి మరియు విజయవాడ నగర పోలీస్‌ విభాగానికి మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ స్విమ్మింగ్‌ కోచ్‌ మోతుకూరి తులసి ఛైతన్య, కృష్ణాజిల్లా స్విమ్మింగ్‌ అధ్యక్షులు ఐ.రమేష్‌, ఐరెన్‌ మ్యాన్‌ డా.రుషీల్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని