యూనిట్

ప్రతిభావంత విద్యార్థులకు అభినందనలు

ఇటీవల విడుదలైన 10వతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 11వ పటాలము కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు అభినందనలతోపాటు మెమొంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు విరామం లేకుండా విధినిర్వహణలో సేవలు అందిస్తున్నారని, వారికి తగ్గట్టు వారి పిల్లలు చదువులో అత్యుత్తమ మార్కులు సాధించడం అభినందించ దగ్గ విషయమన్నారు. బి.చరణి రెడ్డి, టి.కీర్తి, జె.దివ్య లక్ష్మి, ఎన్‌.హరి రాహుల్‌లు అత్యుత్తమ మార్కులు సాధించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు వి.కేశవరెడ్డి, పి.సురేష్‌బాబు, పి.షౌకత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని