యూనిట్
Flash News
"కాఫీ విత్ ఉమెన్"కార్యక్రమాన్ని క్రమంతప్పకుండా నిర్వహించండి: అనంతపురం రేంజ్ డి ఐ జి
అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీ ఆర్.ఎన్
అమ్మి రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలోని పెనుకొండ, సొమందేపల్లి పోలీస్
స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది
పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు,
స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్
రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్ లో సీజ్ చేయబడిన
వాహనాలను మొదలైన వాటి గురించి సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. "కాఫీ విత్ ఉమెన్" కార్యక్రమం లో
బాగంగా ప్రతి శనివారం ఎస్సై ఆయా విలేజ్ మహిళ పోలీస్,మరియు
విలేజ్ పోలీస్ ఆఫీసర్ తో ఒకేసారి మమేకమై గ్రామ పరిది లోని సమస్య పై చర్చించడం
ద్వారా ఆ సమస్య పై పూర్తి సమాచారం అందుతుందని, కావున ఈ
కార్యక్రమాన్ని అందరూ si లు క్రమం తప్పకుండా నిర్వహించాలి
అని తెలియజేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో
సాయంత్రం సమయంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి అని, పిర్యాదు
దారుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ,వారికి
సేవలందించాలన్నారు. కార్యక్రమంలో
డీఐజీ తో పాటు పెనుకొండ సీఐ కరుణాకర్ , కియ ఎస్సై వెంకట
రమణ , సోమందేపళ్లి
ఎస్సై విజయకుమార్, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.