యూనిట్

విద్యతోనే సమాజ పురోభివృద్ధి

విద్యతోమాత్రమే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్‌.పి. అద్నాన్‌ నయీమ్‌ ఆష్మి అన్నారు. జిల్లాలోని పోలీసులకు చెందిన పిల్లలు ఇటీవల విడుదలైన పరీక్షల్లో అత్యంత ప్రతిభను చూపారు. వారికి పోలీసుశాఖ తరపున విడుదలైన మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను ఎస్‌.పి. ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌.పి. మాట్లాడుతూ పట్టుదలతో చదవడం వల్ల క్రమశిక్షణతోపాటు ఉన్నత శిఖరాలు అధిరోహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవచ్చన్నారు. పోలీసులు నిత్యం విధి నిర్వహణలో ఉండి వారికి కష్టాలను గుర్తించిన తమ పిల్లలు కష్టపడి చదివి ర్యాంకులు సాధించడం సంతోషదాయకమన్నారు. అడిషనల్‌ ఎస్‌.పి. ఎస్‌వి శ్రీధరరావు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం ఆనందదాయక మన్నారు. భవిష్యత్‌లో మరింత కష్టపడి ఉన్నతశిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు ఎస్‌.పి. సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్‌పిలు మురళీమోహన్‌, పల్లపురాజు, ఏబీజీ తిలక్‌, సిఐలు రాంబాబు, వై.ఆర్‌.కె.శ్రీనివాస్‌, ఆర్‌.ఐ.లు రవికిరణ్‌, ఈశ్వరరావు, ఏవో శ్యామలరావు, అసోసియేషన్‌ నాయకుడు బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని