యూనిట్

చిత్తూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎస్పీ

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్‌.పి. సెంథిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ.. వారి సేవలను ప్రజలకు తెలిసేలా చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌పి శ్రీమతి సుప్రజ, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసుల ఆయుధ సామాగ్రి పనిచేసే విధానాన్ని ఏఎస్‌పి శ్రీమతి సుప్రజ విద్యార్థులకు వివరించారు.

వార్తావాహిని