యూనిట్
Flash News
జైలునుంచి వచ్చి మళ్ళీ దొంగతనాలకు...
కడప అర్బన్ పరిధిలోని చెన్నూరు పీఎస్ పరిసర ప్రాంతంలో ఎర్రచందనం దొంగలు ఉన్నారనే సమాచారం ఎస్.పి. అభిషేక్ మహంతికి అందింది. వెంటనే డిఎస్‌పి సూర్యనారాయణ పర్యవేక్షణలో చెన్నూరు, రిమ్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. కైలాసగిరి కొండల్లో పోలీసులకు తారసపడ్డ దొంగలు పోలీసులపై మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. చాకచక్యంగా పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని విచారించారు. దొంగతనంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న రూ.60 లక్షల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇరువురు షేక్ సింపతి, సింపతి జాకీర్‌లు ఇటీవలే ఎర్రచందనం కేసులో జైలువెళ్ళి ఇటీవలే విడుదలయ్యారు. అనంతరం మరో ముఠాగా ఎర్రచందనం దొంగతనానికి పాల్పడినట్లు డిఎస్‌పి సూర్యనారాయణ తెలిపారు. వీరితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు డిఎస్‌పి తెలిపారు. జకీర్ నిందితుడిపై పిటీయాక్ట్ కూడా ఉందని తెలిపారు. చాకచక్యంగా దుండగులను అరెస్టుచేసిన సిఐలు పి.సత్యబాబు, టీవీ సత్యనారాయణ, విశ్వనాథరెడ్డి, ఎస్.ఐ.లు విద్యాసాగర్, శ్రీమతి పి.వరలక్ష్మిదేవి, సునీల్‌కుమార్, ఫారెస్ట్ ఆఫీసర్‌లు బ్రహ్మయ్య, శ్రీమతి ఉష, ఇతర సిబ్బందిని ఎస్.పి. అభినందించారు.