యూనిట్
Flash News
వాహన చోదకులను అప్రమత్తం చేస్తూ కాఫీ బైట్ చాక్లెట్లు అందజేత
అనంతపురం
జిల్లా పోలీసులు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా వినూత్న కార్యక్రమాలు
చేపట్టారు. జాతీయ రహదారులపై సుదూర ప్రయాణం చేసే వాహన చోదకులను టోల్ ప్లాజాల వద్ద
ఆపి నిద్ర మత్తు నుండీ మేల్కొలిపి నీటితో ముఖం కడిగించి కాఫీ బైట్ చాక్లెట్లు
అందజేశారు. సుదూర గమ్యాలు జాగ్రత్తగా చేరుకోవాలని సూచిస్తూ అప్రమత్తం చేస్తూ
పంపారు. నిన్న అర్దరాత్రి 12 గంటలు దాటాక
రాప్తాడు పోలీసు స్టేషన్ పరిధిలోని మరూరు,
గుత్తి పోలీసు స్టేషన్ పరిధిలోని
కాశేపల్లి టోల్ ప్లాజాల వద్ద సంబంధిత మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు ఇలా కాఫీ
బైట్ చాక్లెట్లు అందజేశారు. నిన్న పగలు కూడా జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన
చోదకులకు గులాబీలు అందజేసి హెల్మెట్ , సీటు బెల్టు
ధరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆదివారం అర్ధ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మరూరు టోల్ ప్లాజా వద్ద చేపట్టిన
కార్యక్రమంలో అనంతపురం ట్రాఫిక్ డీఎస్పీ మున్వర్ హుస్సేన్ , రాప్తాడు ఎస్ ఐ పి.వై.ఆంజనేయులు, సిబ్బంది కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద గుత్తి సి.ఐ రాజశేఖర్
రెడ్డి,
పామిడి రూరల్ సి.ఐ రవిశంకర్ రెడ్డి, పెద్దవడగూరు ఎస్ ఐ శంకర్ రెడ్డీ సిబ్బంది పాల్గొన్నారు.