యూనిట్
Flash News
హోంగార్డులకు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
ప్రకాశం జిల్లా హోంగార్డులకు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని, కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమం కోసం ఈ సొసైటీని ప్రారంభించడం జరిగిందన్నారు. వారి ఆర్ధిక భద్రతకు ఈ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రాంగా పెట్టంతో సౌత్ కోస్టల్ ఐజి వినీత్ బ్రిజలాల్ వీక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) మహేంద్ర పాత్రుడు, యస్.బి డిఎస్పీ వి.యస్.రాంబాబు, ఒంగోలు పట్టణ డిఎస్పీ ఎ.ప్రసాద్ కుమార్, సి.ఐ ఎన్.శ్రీకాంత్ బాబు, ఆర్.ఐలు ఎం.మనోహర్, ఎ.అంకమ రావు, ఎస్సై ఎస్.కె.నాయబ్ రసూల్, హోంగార్డ్స్ రాష్ట్ర ప్రెసిడెంట్ యస్.గోవింద్, జిల్లా ప్రెసిడెంట్ బాబు రావు తదితరులు పాల్గొన్నారు.