యూనిట్

మినీ మరాథాన్‌ ప్రారంభించిన నగర పోలీస్‌ కమీషనర్‌

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ నగరంలో మినీ మరాథాన్‌ను నగర పోలీస్‌ కమీషనర్‌ సి.హెచ్‌. ద్వారకా తిరుమల రావు ప్రారంభించారు. గుణదల పడవలరేవు సెంటర్‌ నుండి శారధ కళాశాల వరకు 3కె రన్‌ మరియు పాఠశాల విద్యార్ధులకు 1కె రన్‌ నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నిత్యం సమా జంలో పోలీసులు అనేక కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజల కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలియ జేసారు. సమాజ శ్రేయస్సు కోసమే పోలీసులు నిత్యం కృషి చేస్తుంటారని పేర్కొన్నారు. అనంతరం మిని మరాథాన్‌ 3కె మరి యు 1కెలలో మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారికి నగదు బహుమతులను, మరియు ప్రశంసా పత్రాలను అందజేసారు. కార్యక్రమంలో అడ్మిన్‌ డిసిపి ఎస్‌. హరికృష్ణ, నగరంలో విధులు నిర్వహిస్తున్న ఏడిసిపిలు, ఏసిపిలు సి.ఐలు మరియు ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని