యూనిట్

పోలీసు హెడ్ క్వార్టర్స్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

  అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ  ప్రసంగిస్తూ....ఏసు క్రీస్తు ప్రేమకు ప్రతిరూపమన్నారు. ఆయన ప్రేమతో  ప్రపంచాన్ని జయించాడన్నారు. ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా చేసుకోవాలని సూచించారు. ఇతరుల పట్ల ప్రేమతో స్నేహభావంగా ఉండాలని ఆకాంక్షించారు.  సమాజంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సేవాభావం, ప్రేమ, మానవత్వం కలిగి ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీమణి అంకిత, చర్చి ఫాదర్లు అనిల్ కుమార్ , సుందర్ కుమార్ , సి.ఐ  సుబ్బరాయుడు, చంద్రశేఖర్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , పలువురు ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని