యూనిట్

కోడి పందెం రాయుళ్ల పై పోలీసులు దాడులు

నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు కోడి పందెం రాయుళ్ళపై దాడులు నిర్వహించి వారినించి నగదు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో దొంగ చాటుగా జరిగే కోడి పందేలు, పేకాటలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులుకు జిల్లా  ఎస్పీ ఇచ్చిన అదేశాలు మేరకుచిల్లకూరు కడివేడు  గ్రామ పొలాల్లో, గూడూరు డిఎస్పీ సూచనలు మేరకు, గూడూరు రూరల్ సి ఐ  గారి ఆధ్వర్యంలో  ఎస్ ఐ  చిల్లకూరు మరియు వారి సిబ్బంది కోడి పందేల స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించడం జరిగింది.  పక్కా సమాచారం మరియు పగఢ్భందిగా ఈ దాడిని నిర్యాహించి మొత్తం 9 మంది జూదరులను కస్టడీ లోకి తీసుకొని వారి వద్ద నుండి Rs.27,560/- కాష్, 3 ఆటోలు, 14 బైకులుమరియు 8 కోడి పుంజులను స్యాధీనం చేసుకున్నారు.

వార్తావాహిని