యూనిట్
Flash News
చిన్నారి హత్యకేసులో 20 రోజుల్లో చార్జీషీట్ దాఖలు

చిత్తూరు
జిల్లా మదనపల్లె పరిధిలోని బి. కొత్తకోటకు చెందిన చిన్నారి హత్యకేసుకు సంబంధించి
పూర్తి సాక్ష్యాధారాలను రుజువైనందున నిందితుడిపై కోర్టులో డిఎస్‌పి కె.
రవిమనోహరాచారి చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.
నవంబర్ నెలలో కొత్తకోటకు చెందిన దంపతులకు రబకోట మండం అంగళ్లులో ఓ వివాహానికి
హాజరయ్యారు. ఈ సమయంలో మదనపల్లికి చెందిన మహమ్మద్ రఫి బాలికలను అపహరించి హత్యాచారం
చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితున్ని
చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా హత్యకేసులో బలమైన సాక్ష్యాధారాలను
సేకరించామన్నారు. నిందితుడు తప్పించుకోకుండా పకడ్బందీగా చార్జిషీట్ దాఖలు చేసి, పోక్సో కోర్టులో అప్పగించినట్లు ఎస్పీ
తెలిపారు. 20 రోజుల్లో నిందితుడిని అరెస్టు చేసి చార్జిషీట్
దాఖలు చేయడం సబ్‌డివిజన్‌లో ఇదే మొదటిసారన్నారు. త్వరలో న్యాయస్థానంలో నిందితుడికి
కఠిన శిక్ష విధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిఐ అశోక్‌కుమార్, ఎస్.ఐ. సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.