యూనిట్
Flash News
సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు వివిధ జిల్లాలలో విధులు నిర్వర్తిస్తున్న 2014, 2015, 2016 మరియు 2017 బ్యాచ్‌లకు చెందిన 14 మంది యువ ఐ.పి.ఎస్‌లతో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమీక్షా నిర్వహించారు. వారు పనిచేస్తున్న ప్రాంతాలలో కలిగిన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ వ్యవస్థలో సవాళ్ళను సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటూ ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. వివిధ జిల్లాలలో విధులు నిర్వర్తిస్తున్న 14 మంది యువ ఐపిఎస్ అధికారులతో ఆయన మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
అంతకంతకు విస్తృతమౌతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా కట్టడి చేయడానికి మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకొంటూ, సరికొత్త విధానాలను రూపొందించి వృత్తి విధానాలలో అన్వయించాలని సూచించారు. మావోయిస్ట్ ప్రభావిత మరియు సమస్యాత్మక ప్రాంతాలలో పనిచేస్తున్న అధికారుల అనుభవాలు తెలుసుకొని, విపత్కర పరిస్థితులలో వారు ప్రతిస్పందించాల్సిన విధానాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలు, వృద్దులు మరియు చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించి వారికి అండగా నిలవాలన్నారు. ప్రజలలో పోలీస్ వ్యవస్థ పట్ల మరింత గౌరవం, ఆదరాభిమానాలు పెంపొందేలా వారి పనితీరు వుండాలని ఆరకాంక్షించారు. ఈ సమావేశంలో సీనియర్ ఉన్నతాధికారులు శ్రీమతి అనూరాధ, ద్వారకా తిరుమలరావు, హరీష్ కుమార్ గుప్తా, అమిత్ గార్గ్, సునీల్ కుమార్, రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీధర్ రావు, మహేశ్ చంద్ర లడ్డా, సంజయ్, రాజశేఖర్‌బాబుతదితరులుపాల్గొన్నారు. యువ ఐపిఎస్ మహిళా అధికారులు దీపిక, అజిత విజేందల, గౌతమిశాలి మరియు యువ ఐపిఎస్ అధికారులు రాహుల్ దేవ్ సింగ్, కృష్ణరావు, అమిత్ బర్ధర్, అరీఫ్ హఫీజ్, గరుద్ సుమిత్ సునిల్, వకుల్ జిందాల్, వై. రిశాంత్ రెడ్డి, సతీష్ కుమార్, వాసన విద్యాసాగరనాయుడు, బిందుమాధవ్ గరికపాటి మరియు తుహిన్ సిన్హాలు పాల్గొన్నారు.