యూనిట్

రక్తదానం మహాదానం

రక్తదానం మహాదానమని ఎంతోమంది ప్రమాదాలు మొదలుకొని ఇతర కారణాల రీత్యా రక్తం అందక ప్రాణాలు వదులుతున్నారని, అలాంటి వారికి రక్తం దానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని పటాలములు ఐజిపి బి.శ్రీనివాసరావు అన్నారు. 6వ పటాలము ఆవరణలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పటాలములో సిబ్బంది వందమంది రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా వారిని అందరిని అభినందించి, వారికి బలవర్ధకమైన జ్యూస్‌లు ఇతర పదార్థాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఈఎస్‌ సాయిప్రసాద్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ శ్రీనివాస బాబ్జి, యూనిట్‌ డాక్టర్‌ శ్రీమతి మంజువాణి, ఆర్‌.ఐ.లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని