యూనిట్
Flash News
రక్తదానంతో మరోకరికి ప్రాణదానం

గుంటూరు జిల్లాలో పోలీస్
అమరవీరుల వారోత్సవాల భాగంగా గుంటూరు రూరల్ జిల్లా ఎస్.పి. సి.హెచ్.విజయరావు
ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపము నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీస్
సిబ్బందితో పాటుగా పౌరులు, విద్యార్ధులు కలిపి మొత్తం 130 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్.పి. మాట్లాడుతూ అమర
వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, రక్త దానము చేయడం వలన ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని రక్షించిన వారవుతారని
తెలిపారు. ఈ కార్యక్రంలో రూరల్ జిల్లా అదనపు ఎస్.పి.లు కే.చక్రవర్తి, ఎన్.వి.ఎస్. మూర్తి, ఎస్.వి.డి. ప్రసాద్,
పోలీస్ యూనిట్ డాక్టర్ శ్రీమతి డా|| మంజుల
రాజశేఖర్, జీజీహెచ్ డా|| సురేష్,
సిబ్బంది పాల్గొన్నారు.